![]() |
![]() |
.webp)
గ్లామరస్ యాంకర్ అనసూయ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్లి అటు నుంచి అటు శ్రీకాళహస్తిలోని శివాలయాన్ని సందర్శించింది. అక్కడ శివుడికి ప్రత్యేక పూజలు చేసింది. భక్తితత్వం ఉట్టిపడేలా ఈ ఆలయంలో ఆమె దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
"శివుడి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాను.. ఈ ఏడాది ఫస్ట్ పోస్ట్" అని పేర్కొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 'జబర్దస్త్' వదిలేశాక స్టార్ మాలో ఒక షో చేసింది. అది కూడా కొన్నాళ్ళకు పూర్తయిపోయింది. ప్రస్తుతం బుల్లితెర మీద యాంకర్ గా కనిపించడం లేదు. కొంచెం బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ సినిమాలపరంగా మాత్రం చాలా బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్, బన్నీ మూవీస్ తో పాటు దాదాపు పది సినిమాలు చేస్తున్నట్టు సమాచారం.
అనసూయ 'కన్యాశుల్కం' అనే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అనసూయ 'మధురవాణి' అనే వేశ్య క్యారెక్టర్‌లో కనిపించబోతోంది. ఇప్పటికే ఓ మలయాళీ మూవీలో నటించిన అనసూయ మరో మలయాళీ ఫిల్మ్ లో నటించే అవకాశం వచ్చింది. వీటికితోడు ఓ రెండు తమిళ సినిమాలతో పాటు తెలుగులో 'పుష్ప 2'లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ కృష్ణవంశీ మూవీ 'రంగ మార్తండ' మూవీలో కూడా నటించింది.
![]() |
![]() |